భారత రాజ్యాంగంలోని మూడవ అధ్యాయం ( 12 నుంచి 35 ప్రకరణలు ) మొత్తం 24 ప్రకరణలు ప్రాథమిక హక్కులను ప్రస్తావిస్తుంది. 1978, 44వ రాజ్యంగ సవరణలో ఆస్తి హక్కును (31 వ ప్రకరణ ) ప్రాథమిక హక్కుల అధ్యాయం నుంచి తొలగించిన తరవాత, ప్రస్తుతం ఆరు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. అవి :
- సమానత్వ హక్కు ( 14 నుంచి 18వ ప్రకరణ వరకు )
- స్వేచ్ఛా హక్కు ( 19 నుంచి 22వ ప్రకరణ వరకు )
- పీడన నిరోధక హక్కు ( 23 , 24 ప్రకరణలు )
- మత స్వేచ్ఛ హక్కు ( 25 నుంచి 28వ ప్రకరణ వరకు )
- విద్యా, సాంస్కృతిక హక్కులు ( 29, 30 ప్రకరణలు )
- రాజ్యాంగ పరిరక్షణ హక్కు ( 32వ ప్రకరణ )
ప్రాథమిక హక్కులపై ప్రత్యేకంగా పేర్కొనబడిన ప్రకరణలు 14 నుంచి 32. తొలగించిన 31వ ప్రకరణను